రోడ్డు  ప్రమాదంలో గాయపడిన హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్పీ

On
రోడ్డు  ప్రమాదంలో గాయపడిన హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక  సహాయం అందించిన ఎస్పీ

IMG-20240703-WA0006రోడ్డు  ప్రమాదంలో గాయపడిన హోమ్ గార్డ్ కుటుంబానికి పోలీస్ అదికారులు, సిబ్బంది చేయూత

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల విూదుగా కుటుంబ సభ్యులకు రూ.లక్ష ముప్పై వేలు  అందజేత.

ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యునికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అశోక్
జగిత్యాల జూలై3( ప్రజా మంటలు):
గత నెలలో పూడూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోమ్ గార్డ్ ఇమ్రానుద్దీన్ కు పోలీస్ అదికారులు, సిబ్బంది హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సేకరించిన 1,30,000/- రూపాయలును జిల్లా  అశోక్ కుమార్ ఐపిఎస్   చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. ఇమ్రానుద్దీన్  కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తాం అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతూ నిత్యం ప్రయాణాలు చేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విదులు నిర్వర్తించే పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్, ఆర్ ఐ రామకృష్ణ  పాల్గొన్నారు.

------- 

ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యునికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అశోక్

 షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్  జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఐపిఎస్  మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

Tags