సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కోతుల బెడద నివారణ పై దృష్టి కేంద్రీకరించాలి..
జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సేంద్రీయ ఎరువులకు కూడా, రసాయన ఎరువులకు ఇచ్చినట్లే సబ్సిడీ ఇవ్వాలని కోరారు.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పప్పు దినుసులు నూనె గింజలకు మద్దతు ధరకు అదనంగా ప్రోత్సాహకంగా 200/- అందించారు. కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పప్పు దినుసులు, నూనె గింజలకు రూ.1000 ప్రోత్సాహకం అందించాలి.పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగు చేపట్టాలంటే కోతుల బెడద నివారణ తో పాటు గిట్టుబాటు కల్పించాలని కోరారు.రైతాంగానికి కోతుల బెడద గురించి శాసన మండలిలో చర్చించామని గుర్తు చేశారు.
రసాయనిక ఎరువుల కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ,ప్రోత్సాహకాలు సేంద్రీయ ఎరువులకు అందించాలి.ఆరోగ్యానికి మేలు చేసే నాణ్యమైన దిగుబడి కావాలి...
పప్పు దినుసులు ఉత్పత్తి కి ప్రోత్సాహకాలు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలని చెబుతూ, సేంద్రీయ ఎరువుల వినియోగం పెరగాలని చెప్పడం హర్షించదగ్గ విషయం.
రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించాలని, సేంద్రీయ సాగు చేయాలని చెప్పడం హర్షించదగ్గవిషయం.
కోతుల బెడద నివారణ పై దృష్టి కేంద్రీకరించాలి..
కోతుల బెడద నివారణకు పామాయిల్ సాగు చేయాలని, చిన్న రైతుకు సాగు సాధ్యం చేయడం ఎలా సాధ్యం అవుతాది.ఈ ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టకపోతే వ్యవసాయ సాగు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.
కోతుల పునరుత్పతి నిలిపి వేసేలా ప్రతి జిల్లా లో స్టెరిలైసేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి రైతులు పంట సాగుల రక్షణ కోసం పంట చుట్టూ సోలార్ ఫెన్సింగ్ పై 50 శాతం రాయితీ ఇవ్వాలి.రసాయనిక ఎరువుల అధిక వినియోగం తో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు ఇంటి అవసరాల కోసం సేంద్రీయ సాగు చేపడుతున్నారు.
రసాయనిక ఎరువులకు కల్పించే రాయితీలు, సేంద్రీయ ఎరువుల తయారీకి కల్పించాలి.
రైతుగా, ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘ నా అనుభవాని జోడించి,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, సీఎం రేవంత్ రెడ్డి కి విన్న వించుకుంటున్న. భవిషత్ వ్యవసాయ సాగు, సేంద్రీయ ఎరువుల వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలి.
రసాయనిక ఎరువులకు కల్పిస్తున్న రాయితీ లు సేంద్రీయ ఎరువులకు కల్పిస్తూ, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
భారత ప్రధాన మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం రేవంత్ రెడ్డి, చట్ట సభలకు ఎన్నికైన ప్రతినీదులాందరికీ లేఖా రాస్తాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
