తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగుల మరియు వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను విస్మరించే కొడుకులకు, కోడళ్ళకు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు.
ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.
ప్రభుత్వం తరపున నిర్మించే వృద్ధాశ్రమాన్ని సంక్రాంతికి ప్రారంభిస్తామన్నారు.
దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ పథకాలు చట్టాలు అమలు విషయంలో అధికారులు నిబద్ధతతో ఉండాలన్నారు.
అదేవిధంగా కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.
కమిటీ సభ్యుల సలహాలు సూచనలు పరిధిలోకి తీసుకొని అభివృద్ధికై తీర్మానాలు చేశారు.
సదరం,యు డి ఐ డి కార్డు మరియు తదితర సమస్యలు త్వరగా పరిశీలించాలని, దివ్యాంగులకు బస్సు పాసులు,రైల్వే పాసుల విషయంలో సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.
వయోవృద్ధుల సంరక్షణ చట్టం అమలు విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.
దివ్యాంగుల దినోత్సవ పాటల పోటీలలో పాఠశాల విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
దివ్యాంగుల సమస్యలపై
హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగ కల్పన కొరకు చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్ షాపులలో దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఉండేలా చూడాలన్నారు.
అన్ని కార్యాలయంలో ర్యాంపులు ఉండేలా చూస్తామని తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో చట్టాలపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తల్లిదండ్రులు తమ ఆస్తి పిల్లలకు రాసిచ్చే సమయంలో కండిషన్ గిఫ్ట్ డీల్ చేస్తే పోషణ ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉందన్నారు.
దివ్యాంగులు రక్షణ చట్టం మరియు తల్లితండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం పై ప్రజలకు అధికారులకు అవగాహన కల్పించాలన్నారు.
*బధిరుల సూచనలను పాటించాలి.*
జిల్లాలో అంధుల పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ పాఠశాలలో అవసరమైన అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు.
అంధుల భద్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణం జరగాలన్నారు.
అంధులుకు నడవడానికి వీలుగా ఎలక్ట్రికల్ స్టిక్ ఇవ్వాలని కోరారు.
బధిరులకు గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
పాఠశాలల్లో స్వీపర్ శానిటేషన్ పోస్టులను వికలాంగులకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి.రాజా గౌడ్,ఆర్డీవోలు మధుసూదన్,జీవాకర్ రెడ్డి,ఎన్ శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, అదనపు జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్, అదనపు జెడ్పి సిఈవో నరేష్ మరియు సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్, కౌన్సిలేషన్ అధికారులు పీసీ హనుమంత రెడ్డి, పబ్బ శివానందం,ఒజ్జల బుచ్చిరెడ్డి, కమిటీ మెంబర్లు కరుణ, గంగాధర్ ప్రకాష్ రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
