మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా
(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494)
సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో నివసిస్తున్నప్పటికీ ధర్మపురి మూలాలు కలిగిన సౌమ్య విజయం జగిత్యాల జిల్లాకు చెందిన ప్రజలను ఆనంద పరిచింది. అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ప్రతిభను చాటిన ఆమె విజయ కథ ఒక ప్రేరణాస్పద గాథగా నిలిచింది.
సౌమ్య బొజ్జా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఆమె వాసు బొజ్జా సతీమణి. ధర్మపురి నివాసి, గాయత్రీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్ ఒఝల, శ్రీమతి సావిత్రి దంపతుల కుమార్తెగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఆఫీసర్ గా పని చేసి దివంగతులైన ధర్మపురి నివాసి బొజ్జా బాపురావు, రుక్మిణి దంపతుల చిన్న కోడలు ఆయన సౌమ్య చిన్ననాటి నుంచే చురుకు దనంతో, కళాత్మకతతో ప్రత్యేకతను సంతరించు కున్నారు. 1985 జనవరి 22న ముంబైలో జన్మించిన సౌమ్య, విద్యాభ్యాసాన్ని బెంగళూరు, నాగపూర్, ముంబై, దహనులో పూర్తి చేశారు. వివాహానంతరం అమెరికాకు వెళ్లిన ఆమె, యూనివర్సిటీ ఆఫ్ మిల్వాకీ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించి తన ప్రతిభకు విద్యార్హతలను జోడించారు. ప్రస్తుతం ఆమె ఒక బహుళ జాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తూ, తన సృజనాత్మక నైపుణ్యాలను వృత్తి రంగంలో కూడా విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు.
అందాల పోటీల్లో సౌమ్య బొజ్జా ప్రవేశం ఒక్కసారిగా జరగలేదు. మే 4, 2025న నిర్వహించిన ‘మిసెస్ భారత్ ఇల్లినాయిస్ 2025’ పోటీలో కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా ఆమె ఈ రంగంలో తన ప్రతిభను నిరూపించారు. ఆ విజయమే ఆమెకు ప్రేరణగా మారి, మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి దోహద పడింది. ఈసారి అంతర్జాతీయ వేదికపై 'మిసెస్ చికాగో యూనివర్స్ 2026' కిరీటం సొంతం చేసుకోవడం ద్వారా తన ప్రతిభను మరోమారు ప్రపంచానికి పరిచయం చేశారు.
సౌమ్య కేవలం అందాల పోటీలతోనే ఆగిపోలేదు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్, కొరియోగ్రఫీ పట్ల మక్కువ కలిగిన ఆమె, ఆ అభిరుచిని ఫ్యాషన్ రంగంలో విస్తరించారు. చికాగోలో “వస్త్రం బై సౌమ్య” పేరుతో ఒక ప్రత్యేక ఫ్యాషన్ బొటిక్ స్థాపించి, తన సృజనాత్మకతను వ్యాపార రంగంలోనూ విస్తరించారు. ఆమె రూపొందించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం వల్ల, ఫ్యాషన్ ప్రపంచంలోనూ ఆమె పేరు ప్రతిష్టలు పొందింది. అంతేకాక, 2025 న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా అడుగు పెట్టబోతున్నది మరొక గర్వకారణం.
కుటుంబ బాధ్యతలు, వృత్తి కర్తవ్యాలు, కళాత్మక అభిరుచులతో పాటు సౌమ్య బొజ్జా సామాజిక సేవలోనూ ముందంజలో నిలుస్తున్నారు. గృహ హింస బాధితులకు సహాయం అందించడం, వారికి మానసికంగా తోడుగా నిలవడం ద్వారా ఆమె సమాజానికి కూడా తన వంతు సేవ చేస్తున్నారు. ఈ లక్షణం ఆమెను కేవలం ఒక అందాల రాణిగానే కాకుండా, మానవతా విలువలను కాపాడే స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంగా నిలబెడుతోంది.
సౌమ్య బొజ్జా విజయ గాథ ప్రతి ఒక్కరికీ ప్రేరణనిచ్చే విధంగా ఉంది. ప్రతిభ, కృషి, పట్టుదల, అంకితభావం కలిస్తే ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని ఆమె నిరూపించారు. ధర్మపురి నుంచి అమెరికా వరకు వ్యాపించిన ఆమె ప్రయాణం, సాధించిన విజయాలు సమాజంలో మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేవిగా నిలుస్తున్నాయి. ఆమె సాధనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకొందాం...
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
