మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మేడిపల్లి సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి
మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు అన్ని పూర్తి చెయ్యాలి అని సూచించారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్న దృష్ట్యా సాద్యం అయ్యేంత వరకు ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి అని నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు.
పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ, వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.
తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా, బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు.
ఎస్పీ వెంట మేడిపల్లి ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, మరియు సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
