రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి తో హరీశ్ కుమ్ముక్కైనట్లు ఆరోపించారు.ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు.
వారి ప్రకటనలు:
కవిత ప్రెస్ మీట్....
ఒకే విమానంలో రేవంత్‌తో కలిసి హరీష్ ప్రయాణించారు, రేవంత్‌కు హరీష్‌రావు సరెండర్ అయ్యారు ఆ తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి, హరీష్‌పై ఆరోపణలు ఒకరోజు మాత్రమే మీడియాలో వస్తాయి, రెండో రోజు నుంచి హరీష్‌పై ఎవరూ ఆరోపణలు చేయరు హరీష్‌రావుపై రేవంత్ కూడా మాట్లాడరు, హరీష్‌రావు, రేవంత్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది
హరీష్, సంతోష్‌పై కవిత మరోసారి ఆరోపణలు, నాపై ఇద్దరు విష ప్రచారం చేస్తున్నారు, హరీష్‌రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే..బంగారు తెలంగాణ కాదు, నాపై కుట్ర జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదు, 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగలేదు, మహిళా ఎమ్మెల్సీని బాధపెడితే కేటీఆర్ అడగరా, వ్యక్తిగత లబ్ధి కోరుకునేవారు నన్ను బయటకు పంపారు.
పార్టీలో ఏం జరుగుతుందో మా నాన్న తెలుసుకోవాలి, నేను కూడా కేసీఆర్‌లాగే ముక్కుసూటిగా మాట్లాడతా, రేపు కేసీఆర్, కేటీఆర్‌పై కూడా కుట్ర జరగొచ్చు, పార్టీని సొంతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారు,
రామన్నా..హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు అనిపించొచ్చు, తెలంగాణ, మీ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది, టీఆర్‌ఎస్ పెట్టిన 10 నెలల తర్వాత హరీష్ రావు పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు వదులు కోవద్దన్నారు, హరీష్ ట్రబుల్ షూటర్ కాదు..బబుల్ షూటర్
ట్రబుల్ క్రియేట్ చేసేదే హరీష్‌రావు ట్రబుల్‌ను పరిష్కరించానని హరీష్ చెప్పుకుంటారు, కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్ కుట్ర చేశారు ఎన్నికల్లో సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపిచారు, నాకు ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ గాయం చేసింది, మీకు కూడా ఆరడుగుల బుల్లెట్‌తో ప్రమాదం ఉంది, గతంలో పార్టీకి వెన్నుపోటు పొడవాలని హరీష్ చూశారు, కేటీఆర్‌ను బతిమిలాడుకుని పార్టీలో ఉన్నారు, హరీష్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు లు పార్టీ వీడారు, దుబ్బాక, హుజూరాబాద్ ఓటమికి హరీష్ కారణం, సంతోష్‌రావుకు ధనదాహం చాలా ఎక్కువ, కేసుల్లో నేరెళ్ల దళితులను సంతోష్‌రావు ఇబ్బందిపెట్టారు కాంగ్రెస్‌తో హరీష్,సంతోష్ గ్యాంగులు కుమ్మక్కయ్యాయి, నాన్న హరీష్, సంతోష్ మేకవన్నె పులులు, నేను ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదు, జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తా, మా అమ్మకు దూరంగా ఉండడమే ఎంతో బాధగా ఉంది నా నిజాయితీ నిరూపించుకునేందుకే పదవికి రాజీనామా
కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్...
ఎవరో చెత్తగాళ్ల వెనక నేనెందుకు ఉంటాను, నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను,ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను, నాకు అంత సమయంలేదు..మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు, గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు..ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు, ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని ఒక ప్రకటనలో రేవంత్ రెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
