రోడ్డుపై బైఠాయించి విరసన తెలుపుతున్న నల్లగుట్ట వాసులు
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన
దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళన
కాంగ్రెస్ గుండాల దాడులు అంటూ ముద్రించిన ఫ్లెక్సీల ప్రదర్శన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 07 (ప్రజా మంటలు)
అకారణంగా ఇంట్లోకి చొరబడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గొల్లపల్లి నల్ల గుట్టకు చెందిన పలువురు గొల్లపల్లి పోలీస్ స్టేషన్కు ఎదుట బయట రోడ్డుపై బైఠాయించి గురువారం ఆందోళన నిర్వహించారు.
గొల్లపల్లి మండలంలో అమాయకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, నిందితులను అరెస్టు చేయడంలో చూపుతున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసన అంటూ ముద్రించిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ జగిత్యాల ధర్మారం ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
కాలనీకి చెందిన పలువురు మహిళలు యువకులు పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై ఆందోళన నిర్వహించారు .దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది సుమారు గంట పాటు రోడ్డుపై నిరసన తెలుపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా నల్లగుట్ట ప్రాంతానికి చెందిన దండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ నెల 4వ తేదీన ఇంట్లోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేస్తూ భౌతిక దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచారని వారు తెలిపారు.
ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతున్నప్పటికి పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో అదేరోజు దాడి చేసి గాయపరచాలని ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఇప్పటికే అరెస్టు చేయకుండా అరెస్టు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎందుకంటే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు
ఆందోళన కారుల వద్దకు వచ్చిన ఎస్సై వారిని శాంత పరచడానికి యత్నించగా అందుకు వారు ససిమేరా అంటూ భీష్మించు కూర్చున్నారు నిందితులకు తగు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కది లేదు అంటూ ఆందోళన కొనసాగించారు. సమాచారం తెలుసుకున్న ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి తరలివచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు నిందితులను అరెస్టు చేసి బాధితుడికి న్యాయం చేస్తామని ఆందోళన విరమించాలని బాధితుడు బంధువులతో మాట్లాడినప్పటికీ వారు శాంతించలేదు.
దీంతో సీఐ బాధితుడు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు .ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసు ను దింపారు నిందితులు పరారీ లో ఉన్నారని వారిని వెతికి పట్టుకొని రిమాండ్ కు తరలించి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
