రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
జగిత్యాల ఆగస్టు 24 (ప్రజామంటలు)
పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.
ఈ నెల 22-08-2025న జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్ సెలెక్షన్లలో ప్రతిభ కనబరచి రంగారెడ్డి జిల్లా లోనీ ఇబ్రహీం పట్నం లో గల గురుకుల విద్యాపీఠం హై స్కూల్ లో 25-08-2025 మరియు 26-08-2025 తేదీల్లో జరిగే సబ్ జూనియర్ బాయ్స్ (U-15) లో 15 మంది మరియు జూనియర్ బాయ్స్ (U-17) విభాగాలలో 15 మంది రాష్ట్ర స్థాయి సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్–కమ్–సెలెక్షన్స్‌లో ఎంపిక అయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీ డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు మాట్లాడుతూ –
“మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం మా పాఠశాలకు చాలా గర్వకారణం. విద్యార్థులు చదువులోనే కాక క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం పాఠశాల ప్రత్యేకత. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మా విద్యార్థులు ప్రతిభతో రాణిస్తారని నమ్ముతున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
