న్యాయం కోసం వచ్చి... బంది అయిన బాధితులు
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ధర్నా ...స్టేషన్ లోపల బంధించిన పోలీసులు
సీఐ హామీ తో ధర్నా విరమించిన బాధితులు..
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 22 (ప్రజా మంటలు):
తమ కుటుంబ సభ్యుడి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తమకి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ లో బందించిన ఘటన గొల్లపల్లి మండలంలో చర్చనీయాంశం మారింది. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని వడ్డెర కాలానికి చెందిన దండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మీద అదే కాలానికి చెందిన ఓర్సు విజయ్, తిరుపతి, సురేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ నెల నాలుగో తేదిన దాడి చేశారు.
న్యాయం కోసం వస్తే స్టేషన్ లో బంధించారంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. .అయితే ఇదే ఘటనలో గత 18రోజుల క్రితం కూడా నిందితులను అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేయడం గమనార్హం
ఈ ఘటన లో తీవ్ర గాయలైన శ్రీనివాసు ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో దాడి చేసిన నిందితులపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.అయితే పిర్యాదు చేసి 18 రోజులు అవుతున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో పోలీస్ ల తీరును నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్ ముందు శుక్రవారం రోజు ధర్నాకు దిగారు.
ధర్నా చేయడంతో జగిత్యాల- ధర్మారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.దీంతో నిరసన కారులతో ధర్నా విరమించడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా బాధిత కుటుంబ సభ్యులు వినకపోవడంతో వారిని స్టేషన్ లోకి తీసుకెళ్ళి గేట్ వేసి బంధించారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నిరసనకారులను విడిచిపెట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
