బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి (బుగ్గారం) జూలై 31 (ప్రజామంటలు):
బుగ్గారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
బుగ్గారం మండలానికి మంజూరు అయిన 369 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం 21 లక్షల రూపాయల విలువ గల 21 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తోంది. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా మహిళలఆర్థిక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అన్నారు.
పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు రేషన్ కార్డుల కల నెరవేరిందని, ఇకపై రేషన్ కార్డులు రానివారు మీసేవా కేంద్రాలు లేదా ప్రజాపాలన శిబిరాల్లో దరఖాస్తు చేయవచ్చని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తక్షణమే కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో పేర్ల జోడింపు ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, నగునూరి నర్సగౌడ్,బత్తుల తిరుపతి, బీర్పూర్ తిరుపతి, కండ్లె మదన్, కుంట మహేష్,గలిపెల్లి వెంకన్న, నంది తిరుపతి, సమిత్ పెద్దనవేని శంకర్, కోడిమ్యల రాజన్న, జంగ శ్రీనివాస్, తడేపూ లింగన్న,బండారి మహేష్, గడ్డం నారాయణ, తెనుగు గంగన్న,బుర్ర రమేష్, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
