త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు
*
భీమారం జులై 30 (ప్రజా మంటలు)
త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్,ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక రివ్యూ ఏర్పాటు చేశారు .
వారు మాట్లాడుతూ. కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను ముమ్మరంగా కొనసాగించవలసిందిగా కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 3 ఎకరాల భూ సేకరణ నష్ట పరిహారాన్ని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి ఇవ్వడం జరిగింది అన్నారు . స్టేజి 2 ఫేస్ 1 శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2005లో 1731 కోట్లతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు..
రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుందని తెలిపారు...
ఆనాడే నిధులు మంజూరు అయిన పనులు పూర్తి చేయలేదన్నారు.. 2018 ఎన్నికల్లో 200 కోట్లతో ఆనాడు అప్పటి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ ఏసి ఈ దసరా కే నీళ్లు ఇస్తామని చెప్పి అలాంటి దసరాలు ఎన్ని పోయినా కానీ ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు.. గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం చేశారు..
మేము 37 సార్లు ప్రాజెక్ట్ నిర్మన్ పూర్తి చేయాలని అనేక చేశామని, ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శిరవేగంగా పూర్తి చేస్తామని మాట ఇచ్చారని, నేడు ఎమ్మెల్యేగా తను పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు కొనసాగుతాయని తెలిపారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికార్లకు సూచించి రాష్ట్రంలోని మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తీ చేసే వాటిలో చేర్చి 350 కొట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని ఇప్పటికే మొత్తం నిర్మాణం పూర్తయిందని తెలిపారు..
2018 లో బిఆర్ఎస్ వారు కనీసం భూ సేకరణ కోసం కూడా డబ్బులు లేకుండా ఎన్నికల్లో ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారు.. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే కూడి ఎడమ కాలువల నిర్మాణానికి 500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.. మొదటి దఫా భూసేకరణ కు 10 కోట్ల నిధులు మంజూరీ అయి జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో త్వరలోనే కుడి ఎడమ కాలువల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. గత ప్రభుత్వ హయాంలో 75 కోట్ల కాంట్రాక్టర్కు బకాయి పెడితే ప్రజా ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించడం జరిగింది అని తెలిపారు...
గత ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేసిందన్నారు.. రానున్న రోజుల్లో వేములవాడ నియోజవర్గన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
