మురుగు పారుతున్న రోడ్డుపైనే కూర్చొని నిరసన - మురుగునీటి సమస్యపై బస్తీవాసులతో కలసి రోడ్డెక్కిన కార్పొరేటర్
అంబేడ్కర్ నగర్ వాసులు మనుషులు కారా...?
*వారిని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారా..?
*బస్తీవాసులతో కలసి రోడ్డుపై కార్పొరేటర్ దీపిక ధర్నా
సికింద్రాబాద్, జూలై 22 (ప్రజామంటలు) :
గత సంవత్సరం నుండి ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీ, అంబేద్కర్ నగర్ లో పొంగుతున్న మురుగునీటి సమస్య ను ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ బస్తీ వాసులతో కలసి మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక మంగళవారం మురుగునీరు పారుతున్న రోడ్డుపైనే బైఠాయించి, ధర్నా చేశారు. మురుగు నీటి సమస్య ను పరిష్కరించాలని ఇప్పటి వరకు తాము ఎన్నోసార్లు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి, జీఎం వినోద్ లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికి ఎలాంటి స్పందన లేదని కార్పొరేటర్ కొంతం దీపిక వాపోయారు. బస్తివాసులు స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. . స్థానిక కార్పొరేటర్ గా తాను నిధుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే, ఎంపీ ల దృష్టి కి తీసుకెళ్ళానని, అయినప్పటికీ అధికారుల్లో చలనం లేదన్నారు.
ఎప్పుడు అడిగినా నిధులు లేవు రెవెన్యూ సెక్షన్లో ఫైల్ ఆగి ఉంది అని సమస్యను దాట వేస్తున్నారని కార్పొరేటర్ అన్నారు. అంటే అంబేద్కర్ నగర్ వాసుల ప్రాణాలకు విలువ లేదా కేవలం ఎలక్షన్ కోసము ఓట్ల కోసము అంబేద్కర్ నగర్ మనుషులని వాడుకుంటారా అని దీపిక ప్రశ్నించారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి సిగ్గుపడుతూ ఈరోజు అంబేద్కర్ బస్తివాసుల పక్కన నిలబడి వారికోసం ధర్నా చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా చేసిన ఈ ధర్నా లో అఖిల పక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి అన్ని పార్టీల నాయకులు బస్తివాసులు దీంట్లో పాల్గొన్నారని తెలిపారు. ధర్నాలో అంబేద్కర్ నగర్ బస్తీ నాయకులు చిన్న వీరయ్య, బాల నరసింహ, కోటయ్య, బాలు యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, కోటమ్మ, కుమారి ,గణేష్ నర్సింగ్ బిజెపి డివిజన్ అధ్యక్షులు జితు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
