బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు
బుగ్గారం జూలై 24 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రికార్డుల తనిఖీ జరిగింది. ఈ తనిఖీల్లో మరింత దుర్వినియోగంతో పాటు అనేక అక్రమాలు బయట పడ్డాయని పిర్యాదు దారుడైన విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రికార్డుల పరిశీలకులు బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విలేఖరులతో మాట్లాడారు. ఈ తనిఖీల్లో బయట పడ్డ దుర్వినియోగాన్ని, అక్రమాలను, అధికారుల, పాలకుల తప్పిదాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇకనైనా అధికారులు సక్రమంగా స్పందించి చర్యలు చేపట్టక పోతే న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్ళి తగు న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ప్రజలు, యువకులు, విద్యావంతులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అవినీతి, అక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలని వారు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తగు న్యాయం కోసం చట్ట బద్దంగా పోరాటం చేస్తామన్నారు. ఈ రికార్డుల తనిఖీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (స్వచ్ఛంద సంస్థ) జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నా రెడ్డి, జిల్లా కార్యదర్శి పల్లికొండ అనిల్, రిటైర్డ్ టీచర్ చెట్ పల్లి రాజమల్లయ్య, విడిసి కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
