భద్రతా జాగ్రత్తలు - కార్మికుల ప్రాణానికి రక్ష_ ప్రమాద రహిత జిల్లాగా జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం
మెట్ పల్లి జులై 22 (ప్రజా మంటలు)
విద్యుత్ సంస్థ లో పని చేసే ప్రతీ కార్మికుడు విధిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తే తమ ప్రాణాలకు శ్రీరామ రక్ష అని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని లైన్లలో పనులు నిర్వహించాలని జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం ఉద్బోధించారు.
మెటుపల్లి లో మంగళవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మల్లాపూర్, మెటుపల్లి రెండు సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బంది కార్మికులకు భద్రతా ప్రమాణాల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులకు ఉపక్రమించే ముందు ప్రతీ కార్మికుడు హెల్మెట్, సేఫ్టీ బెల్ట్, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్, ఇండక్షన్ టెస్టర్ తప్పనిసరిగా వాడాలని, జగిత్యాల జిల్లాను విద్యుత్ ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దాలని, తమ ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాల రక్షణకు కంకణం కట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఎవరైనా రక్షణ జాగ్రత్తలు తీసుకోనట్లు ఫోటో పంపిస్తే రూ.3 వేల జరిమాన వారి జీతం నుండి కోసి ఎన్పీడీసీఎల్ చారిటీ అకౌంట్ కు విరాళంగా పంపుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మెట్టుపల్లి డీఈ మధుసూదన్, డీఈ టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ గంగారాం, ఏడీఈ మనోహర్, ఏఈలు రవి, ప్రదీప్, అజయ్, వినీత్, సతీష్, సంతోష్ మరియు కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
