గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
త్వరలో రహదారి సమస్యకు పరిష్కారం చేస్తాను - మంత్రి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో స్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దారి లేక మట్టిలోనూ, పొలాల్లోనూ మోసుకెళ్లే దుస్థితి నెలకొనగా, ఈ సమస్య పట్ల గత పదేళ్లుగా పాలనలో ఉన్న నేతలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు మంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ తో విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలాన్ని సందర్శించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికనాయకులు,ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో కలిసి స్మశాన వాటిక స్థితిని, రహదారి లేదని ఎదురయ్యే సమస్యలను వివరంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఒక గ్రామంలో స్మశాన వాటికకు కూడా రహదారి లేకపోవడం బాధాకరమని,ఇది మన పౌరుల మౌలిక హక్కులకు వ్యతిరేకమని,ఈ సమస్యను ఇకమీదట ఇలాగే వదిలిపెట్టే ప్రసక్తే లేదని,అవసరమైన నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధుసూదన్, మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ ఛైర్మన్ పుర పాటి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ తాసిల్దార్ కటకం వరంధన్, ఎంపీడీవో రాంరెడ్డి,నాయకులు మార్కెట్ డైరెక్టర్ కొక్కుల జలంధర్, రాపల్లి గంగన్న, బుచ్చిరెడ్డి కార్యకర్తలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
