జాతీయ రహదారి "563", జగిత్యాల నుండి కరీంనగర్ వరకు గల రోడ్డు విస్తరించండి - జయశ్రీ హనుమండ్ల,

On
జాతీయ రహదారి

జగిత్యాల జూలై 24 (ప్రజా మంటలు):

జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారి 563 నాలుగు లైన్ల విస్తరణకు ప్రకటన చేసి నాలుగే ఏళ్లు ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదని, వెంటనే పనులు చేపట్టాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ను కోరారు.

ఆమె మంత్రికి రాసిన వినతిపత్రంలో..జాతీయ రహదారి "563" కోరకు జగిత్యాల జిల్లా పరిదిలోని "0 Km to 26.3 Km" వరకు మరియు కరీంనగర్ జిల్లా పరిదిలోని "26.3 km to 59.353 km" వరకు నాలుగు లైన్ల రహదారి కొరకు కేంద్ర ప్రభుత్వం తేది: 24/11/2021 రోజున భారత ప్రభుత్వ రాజపత్రం (The Gazette of India) SO. No. 4847 [E] జారీ చేసి భూసేకరణకు సంబందించి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూమి వివరాలను పొందు పరుస్తూ " పత్రికాప్రకటన " చేయగా అందులో కొందరు రైతులు అభ్యంతరాలు తెలియచేయగా వాటిని సవరణ చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వం మరొక "రాజపత్రం" (Gezette) నెంబర్ SO.No. 5042 (E) తేది: 27/10/2022 రోజున జారీ చేసి తిరిగి పూర్తి వివరాలతో మళ్ళీ పేపరు ప్రకటన చేయడం జరిగిందనిపేర్కొన్నారు.

ఈ పేపర్ ప్రకటనలో రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూముల వివరాలు పొందుపర్చి ఇవ్వడం జరిగింది. కాని, ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు గడిచిన ఒక్క రైతు వద్ద భూసేకరణ చేయలేదు. రైతుకు నష్ట పరిహారం కూడ అందించలేక పోయారు. "అత్యంత ప్రమాదకర" రహదారులలో ఒక్కటి అయిన ఈ రహదారి పైన భూసేకరణ చేయకపోవడం చాల శోచనీయం. "నరేంద్రమోడీ" గారు మూడవ సారి ప్రదాన మంత్రి ఆయిన తరువాత అత్యంత ప్రమాదకర రహదారులను "100" రోజులలో  మొదలు పెట్టాలని గుర్తించిన రహదారుల లో "563" రహదారి ఒక్కటి. " నరేంద్ర మోడీ " ప్రమాణ స్వీకారం చేసి దాదాపు "400 రోజులు" అయిన ఇప్పటివరకు భూసేకరణ అనేది ఆరంభమే కాలేదను, వెంటనే భూసేకరణ ప్రారంభించాలని ఆమె కోరారు.

ఈ రోడ్డు మీద నిత్యం ఒక యాక్సిడెంట్ తో నెత్తూరోడుతున్న, పట్టించుకోని అధికారుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి పెద్ద దిక్కులను కోల్పోయి, మరి కొన్ని కుటుంబాలలో వికలాంగులుగా మారిన పరిస్థితి అయిన ఇప్పటి వరకు అదికారులు ఈ రోడ్డు విషయం సిరియస్ గా తీసుకో కపోవడం భాదాకరం. 

తెలంగాణ లోని అత్యంత ప్రమాదకర రహదారి అయిన "563"ను నిర్మించుకోకపోవడం మరియు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు అయిన బండి సంజయ్ గార్కి దాదాపు 45 కి.మీ  లు ఆయన పరిదిలో ఉండటం వల్ల వారికి కూడ గతంలో ఈ రోడ్డు గురించి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా మీరు దీని పైన దృష్టి వహించి పూర్తి వివరాలు తీసుకుని వెనువెంటనే రోడ్డు నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర మంత్రిగా,నితిన్ గడ్కరీ ఇప్పటికైనా జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్ళె రహదారిని, వెను వెంటనే భూసేకరణ పూర్తి చేసి, రోడ్డు కొరకు టెండర్ పిలుస్తూ మా ప్రజలందరి కల అయిన ఈ రోడ్డును వెంటనే ప్రారంబించాలని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు మద్యలో నివసించే కుటుంబ సభ్యుల పక్షాన, నిత్యం ఈ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ అన్నారు.

Tags

More News...

Local News 

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష    

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష     రామగుండం జూలై 26: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం  ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా   పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న  హనుమంతు,...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) లైంగిక వేధింపులు, గృహహింసకు, అత్యాచారo కు  గురైన బాధితులకు న్యాయ, వైద్య, మరియు సైకాలజికల్ సపోర్టు వంటి సేవలు  ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో భరోసా కేంద్రాని  ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో భరోసా...
Read More...
Local News 

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు) కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్‌ను గురువారం జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. నాయకులు  ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ కాశీ నాదం మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్‌ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని...
Read More...
Local News 

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం, ఇబ్రహీంపట్నం జులై 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన...
Read More...
Local News 

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు   జగిత్యాల జులై 25( ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏట నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం శ్రావణమాసం అభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి .వైదిక క్రతువులు అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ .జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహించారు. ఉదయము స్వామివారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తు . మన్యుసూక్తము,...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ  - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు వేములవాడ అమ్మవార్లకు బోనాలు -ప్రముఖ మెజీషియన్ సామల వేణు    సికింద్రాబాద్  జూలై 25 (ప్రజా మంటలు):: :బీసీల ఐక్యత బలంగా ఉండడానికి తెలంగాణ మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భారీగా కార్లు,బస్సుల ర్యాలీగా వెళ్ళి వేములవాడ అమ్మవార్లకు బోనాలు సమర్పించనున్నట్లు ప్రముఖ మెజిషీయన్, మున్నూరు కాపు రాష్ర్ట నాయకులు  సామల వేణు అన్నారు. తెలంగాణ మున్నూరు...
Read More...
Local News 

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు) పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ.... పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి...
Read More...
Filmi News  State News 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు  సికింద్రాబాద్, జూలై 25 ( ప్రజామంటలు): ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్  సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు...
Read More...
Local News 

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

 విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన గొల్లపల్లి జూలై 25 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా విద్యార్థుల్లో మత్తు పదార్థాల దుర్వినియోగము,అక్రమ రవాణా అడ్డుకట్ట పట్ల సమాజంలో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి నృత్య ప్రదర్శన ఇచ్చారు. మత్తు పదార్థాల దుర్వినియోగం ద్వారా...
Read More...
Local News 

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్  డి ఈ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏ ఈ శరన్ తదితరులు ఉన్నారు.
Read More...
Local News 

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా 25 (ప్రజా మంటలు) జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ది దారులకు పంపిణీ చేసిన  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ...
Read More...

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్ 

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్    గొల్లపల్లి జూలై,25 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం కోటిలంగాల శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి ఆలయ కమిటీ చెర్మన్ గా పుదారి రమేష్ కు నియామకపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా  అందజేశారు  నాపై నమ్మకం తో నియామకానికి సహకరించిన, రాష్ట్ర ఎస్సి,...
Read More...