ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూగ జీవి ప్రాణాన్ని రక్షించిన యువకుడు
గొల్లపల్లి జూలై 22 (ప్రజా మంటలు):
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విలవిలలాడుతున్న కోతిని, స్థానికులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఓ యువకుడు స్పందించి, సంఘటన భీమరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మండలంలోని భీమ్రాజు పల్లి గ్రామానికి చెందిన ఎనగందుల రూపేష్ తన మిత్రులతో కలిసి సోమవారం ఎండపల్లి మండల కేంద్రానికి వెళ్లాడు. అక్కడే రోడ్డు దాటుతుండగా ఓ వానరాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దారిన వెళ్లేవారు ఎవరు పట్టించుకోకపోవడంతో. విలవిలలాడుతున్న కోతిని చూసి రూపేష్ స్పందించారు.
తక్షణ వైద్యం అందించడానికి అక్కడ తనకు ఎవరూ తెలియకపోవడంతో తెలిసిన రిపోర్టర్ కు ఫోన్ చేయడంతో ఆయన స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందజేశారు. స్పందించిన ఎండపల్లి పశువైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి చికిత్సను అందించారు. అయినప్పటికీ వానరం కోలుకోకపోవడంతో మంగళవారం మెరుగైన వైద్యం అందించేందుకు ఆటోలో, తన సొంత ఖర్చులతో మరో ముగ్గురి మిత్రుల సాయంతో కోతిని కోరుట్లలోని, పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాలకు తరలించారు.
రిపోర్టర్ చోరవతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. గాయపడిన వానరం కోలుకుందని వైద్యులు దృవీకరించారు. సకాలంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూగ జీవికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేసిన రూపేష్ కు, సహకరించిన మిత్రులకు, కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
