ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలి - రాష్ట HRC హెచ్చరిక
హైదరాబాద్ జూలై 23:
చట్టపరమైన పరిష్కారాలను అనుసరించే ఏ ఫిర్యాదుదారుడిని బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా బలవంతం చేయడం మానుకోవాలని రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు స్పష్టమైన సూచనలను జారీ చేయాలని TGHRC, తెలంగాణ DGPకి సిఫార్సు చేసింది.
HRC ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC), 2018 ఏప్రిల్‌లో సంతోష్‌నగర్ PSలో పోలీసు అధికారులు అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం మరియు చేయని తప్పు ఒప్పుకోమని బలవంతం చేశారని ఆరోపిస్తూ, జి. ప్రశాంత్ కుమార్ మరియు మరొకరు దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలించింది.
ఫిర్యాదుదారుడిని (HRC No. 3064 of 2018) విచారించిన మరియు రికార్డులను పరిశీలించిన తర్వాత, ఈ విషయం ప్రస్తుతం sub-judice (కోర్ట్ లో పెండింగ్) ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారులు చేసిన బలవంతం మరియు బెదిరింపుల ఆరోపణలు నివారణ చర్యకు అర్హమైనవని కమిషన్ పేర్కొంది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 ప్రకారం - అటువంటి కేసులలో పోలీసుల దుష్ప్రవర్తనను నిరోధించడానికి, ఫిర్యాదుదారుల భద్రతను నిర్ధారించడానికి మరియు ఆరోపించిన దుష్ప్రవర్తనపై ప్రాథమిక శాఖాపరమైన విచారణను ప్రారంభించడానికి సూచనలు జారీ చేయాలని కమిషన్ వారు తెలంగాణ DGP వారికి సిఫార్సు చేసింది. ఫిర్యాదుదారుడిని వేధించరాదని మరియు ఎటువంటి భయం లేకుండా చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి వీలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
