కేటీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రులు రాజేశం గౌడ్, కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ జూలై 24:
సిరిసిల్ల శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మరియు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జులై 24న ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు గోడిశెల రాజేశం గౌడ్, కొప్పుల ఈశ్వర్ మరియు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దామోదర్ తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ, కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చి వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారని ,మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధి అందించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
