శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి
సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు):
జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోనాల జాతర కార్యవర్గంను ఎన్నుకున్నారు.బోనాల జాతర అధ్యక్షునిగా కలపగురి శ్యామ్ రావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1926లో దక్కన్ మానవ సేవా సమితి ఏర్పడిందని, ఆలయం వద్ద జంతుబలిని ఆపి, గత 99 సంవత్సరాలగా సాత్విక పూజ నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారని, భక్తులు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో కార్య నిర్వాహక అధ్యక్షులు కొంక రఘుమోహన్,ప్రధాన కార్యదర్శి అత్తిలి మల్లికార్జున గౌడ్,కార్యనిర్వాక కార్యదర్శి సి.కె నర్సింగ్ రావు,రిసెప్షన్ కమిటీ చైర్మన్ కె.వి కమల్ కుమార్,ఫుడ్ కమిటీ కన్వీనర్,సిహెచ్ శ్రీనివాస్,కార్యదర్శి వజనాల దయానందరావు, రిసెప్షన్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్.శ్రావణ్ కుమార్,ప్రచార కమిటీ కన్వీనర్.గున్నాల రవికుమార్,కోశాధికారి గోపిశెట్టి ప్రభాకర్ తో పాటు ఉపాధ్యక్షులు,జాయింట్ సెక్రెటరీలు,కార్యనిర్వహక సభ్యులను ఏన్నుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
