జాతీయ రహదారి "563", జగిత్యాల నుండి కరీంనగర్ వరకు గల రోడ్డు విస్తరించండి - జయశ్రీ హనుమండ్ల,
జగిత్యాల జూలై 24 (ప్రజా మంటలు):
జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారి 563 నాలుగు లైన్ల విస్తరణకు ప్రకటన చేసి నాలుగే ఏళ్లు ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదని, వెంటనే పనులు చేపట్టాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ను కోరారు.
ఆమె మంత్రికి రాసిన వినతిపత్రంలో..జాతీయ రహదారి "563" కోరకు జగిత్యాల జిల్లా పరిదిలోని "0 Km to 26.3 Km" వరకు మరియు కరీంనగర్ జిల్లా పరిదిలోని "26.3 km to 59.353 km" వరకు నాలుగు లైన్ల రహదారి కొరకు కేంద్ర ప్రభుత్వం తేది: 24/11/2021 రోజున భారత ప్రభుత్వ రాజపత్రం (The Gazette of India) SO. No. 4847 [E] జారీ చేసి భూసేకరణకు సంబందించి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూమి వివరాలను పొందు పరుస్తూ " పత్రికాప్రకటన " చేయగా అందులో కొందరు రైతులు అభ్యంతరాలు తెలియచేయగా వాటిని సవరణ చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వం మరొక "రాజపత్రం" (Gezette) నెంబర్ SO.No. 5042 (E) తేది: 27/10/2022 రోజున జారీ చేసి తిరిగి పూర్తి వివరాలతో మళ్ళీ పేపరు ప్రకటన చేయడం జరిగిందనిపేర్కొన్నారు.
ఈ పేపర్ ప్రకటనలో రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూముల వివరాలు పొందుపర్చి ఇవ్వడం జరిగింది. కాని, ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు గడిచిన ఒక్క రైతు వద్ద భూసేకరణ చేయలేదు. రైతుకు నష్ట పరిహారం కూడ అందించలేక పోయారు. "అత్యంత ప్రమాదకర" రహదారులలో ఒక్కటి అయిన ఈ రహదారి పైన భూసేకరణ చేయకపోవడం చాల శోచనీయం. "నరేంద్రమోడీ" గారు మూడవ సారి ప్రదాన మంత్రి ఆయిన తరువాత అత్యంత ప్రమాదకర రహదారులను "100" రోజులలో మొదలు పెట్టాలని గుర్తించిన రహదారుల లో "563" రహదారి ఒక్కటి. " నరేంద్ర మోడీ " ప్రమాణ స్వీకారం చేసి దాదాపు "400 రోజులు" అయిన ఇప్పటివరకు భూసేకరణ అనేది ఆరంభమే కాలేదను, వెంటనే భూసేకరణ ప్రారంభించాలని ఆమె కోరారు.
ఈ రోడ్డు మీద నిత్యం ఒక యాక్సిడెంట్ తో నెత్తూరోడుతున్న, పట్టించుకోని అధికారుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి పెద్ద దిక్కులను కోల్పోయి, మరి కొన్ని కుటుంబాలలో వికలాంగులుగా మారిన పరిస్థితి అయిన ఇప్పటి వరకు అదికారులు ఈ రోడ్డు విషయం సిరియస్ గా తీసుకో కపోవడం భాదాకరం.
తెలంగాణ లోని అత్యంత ప్రమాదకర రహదారి అయిన "563"ను నిర్మించుకోకపోవడం మరియు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు అయిన బండి సంజయ్ గార్కి దాదాపు 45 కి.మీ లు ఆయన పరిదిలో ఉండటం వల్ల వారికి కూడ గతంలో ఈ రోడ్డు గురించి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా మీరు దీని పైన దృష్టి వహించి పూర్తి వివరాలు తీసుకుని వెనువెంటనే రోడ్డు నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రిగా,నితిన్ గడ్కరీ ఇప్పటికైనా జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్ళె రహదారిని, వెను వెంటనే భూసేకరణ పూర్తి చేసి, రోడ్డు కొరకు టెండర్ పిలుస్తూ మా ప్రజలందరి కల అయిన ఈ రోడ్డును వెంటనే ప్రారంబించాలని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు మద్యలో నివసించే కుటుంబ సభ్యుల పక్షాన, నిత్యం ఈ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
