ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.
గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్
సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) :
గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి తెలిపారు.
ఆసుపత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరీ చేసిందన్నారు. ఆసుపత్రి ఐపీ బ్లాక్ లో సుమారు 500 టాయిలెట్స్ రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని, వీటి శుభ్రత, కాపాడుకోవడంలో సిబ్బందితో పాటు వాటిని వినియోగించే రోగులు, వారి సహాయకులపై ఉందన్నారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని ఇది అందరి బాధ్యత అని భావించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎమ్ఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ సునీత బాయి, డీఈ శ్యామ్ లాల్, ఏఈ జగదీశ్ ప్రసాద్, భీమన్న, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
