ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
జగిత్యాల మే 27 ( ప్రజా మంటలు)
ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి హెచ్ ఎస్ ఓ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీ పై 20 రూ./- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80%-100% సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి 4200/- సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
డి ఏ ఓ భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 30 సంవత్సరాల నుండి ఆయిల్ పామ్ సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారని, ఇక్కడి రైతులు కూడా వరి విస్తీర్ణన్ని తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేయాలనీ సూచించారు.
లోహియా సీఈఓ సిద్ధాంత్ లోహియా మాట్లాడుతూ యశ్వంతరావు పేట గ్రామంలో సెప్టెంబర్ 4 న ఫ్యాక్టరీ శంకస్థాపన చేస్తున్నామని, ప్రతి రైతు ను బంగారు రైతుగా చేసే దిశగా కంపెనీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా కొత్తగా ఆయిల్ పామ్ పెట్టుకునే రైతులకు బంగారు మరియు వెండి స్కీమ్స్ గురించి వివరించారు.
ఎల్ డి ఎం మాట్లాడుతూ ఆయిల్ పామ్ పెట్టె రైతులకు ఎకరానికి 50000/- టర్మ్ లోన్ ఇస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించే వరి నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని, కూలీల కొరత అధికంగా ఉందని, వరికి వచ్చే చీడపీడల సమస్య ఎక్కవగా ఉండడం వల్ల లాభసాటి పంటలు పండించాలని, ఆయిల్ పామ్ పంట నే దానికి ప్రత్యామ్నాయమని తెలిపారు.
ఆయిల్ పామ్ లో అరటి, బొప్పాయి, వక్క, కోకో వంటి అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని, ఈ సంవత్సరంలో 3750 ఎకరాలలో ఆయిల్ ఫామ్ నాటుటకు లక్ష్యం ఉందని తెలిపారు.
ప్రతి గ్రామంలో ఆయిల్ పామ్ పైఅవగాహన పెంపొందించడానికి లోహియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారరథాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న కొంతమంది ఆదర్శ రైతులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, ఆర్ డి ఓ మధుసూదన్ ,లోహియా సిఈ ఓ సిద్ధాంత్ లోహియా, మార్కెటింగ్ మేనేజర్ ప్రదీప్ పట్నాయక్, జగిత్యాల్ ఏ డి ఏ తిరుపతి నాయక్, ఉద్యాన అధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్ , యు బి ఐ చీఫ్ మేనేజర్ ,లోహియా జిల్లా మేనేజర్ విజయ్ భరత్, క్షేత్ర సిబ్బంది, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి
