కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా
5వ మహాసభలను విజయ వంతం చేయండి
పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి
(చుక్క గంగారెడ్డి)
జగిత్యాల మే 12 (ప్రజా మంటలు):
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
సోమవారం జగిత్యాల లోని ఆర్డీవో చౌరస్తాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ అధ్యక్షతన
పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు మహా సభల కరపత్రం ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాదన కుమార స్వామి మాట్లాడుతూ ఈనెల 14 బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో ఈ మహా సభలు జరుగుతాయని అన్నారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నలు మూలల నుండి ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యార్థులు, సామాజిక వేత్తలు, కార్మికులు, కర్షకులు, విద్యా వంతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి అనే అంశంపై బహిరంగ సభలో వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి లు ప్రసంగిస్తారని ఆయన వివరించారు.
గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, హక్కుల సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాయని ఆయన వివరించారు. మావోయిస్టు పార్టీ రెండు లేఖల ద్వారా యూట్యూబ్ ఇంటర్వ్యూ ల ద్వారా శాంతి చర్చలకు తాము సిద్ధమని ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తామని తెలిపారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పీస్ కమిటీ, దేశ వ్యాప్త మేధావుల కమిటీ శాంతి చర్చలకై కృషి చేస్తుందన్నారు.
రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లు చర్చలకు సమ్మతమని కేంద్రానికి లేఖ రాస్తామని బి.ఆర్.ఎస్. పార్టీ రజతోత్సవ బహిరంగ సభలో వెల్లడించారని ప్రజలు హర్షధ్వానాలతో జై కొట్టారని సూచించారు. దేశంలోని వామపక్షాలు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, కగార్ ఆపరేషన్ నిలిపివేసి, మావోయిస్ట్ పార్టీ తో శాంతి చర్చలు జరపాలనే సమయంలో కరీంనగర్ లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను నిర్వహిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీం నగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ఉపాధ్యక్షులు నార వినోద్, కార్యవర్గ సభ్యులు బి.లక్ష్మణ్, కడ రాజన్న, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, టిఫిజాక్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు పొన్నం రాజ మల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు చెట్టి రాజేశ్వర్, ముంజాల సత్తయ్య గౌడ్, కొప్పుల శంకర్, నారపాక నర్సన్న, గంగరాజు, నార పాక రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
