కాంగ్రెస్ - బీజేపీ ల మధ్య ఫ్లెక్సీలు చింపారని రగడ
గొల్లపల్లి ఎప్రిల్ 14 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నాయకుడు కట్ట మహేష్ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లేక్సీలు చింపించారని గొడవ జరుగుతుంది.
కొంత మంది కట్ట మహేష్ అనుచరులు సుమారు ఆరు ఫ్లేక్సీలు రాత్రి 7 గంటల సమయంలో ఫ్లేక్సీలను రాళ్ళతో కొట్టి కత్తితో ఫ్లేక్సీలు చింపైన దృశ్యాలు, ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడం తో, దృశ్యాలను పరిశీలించినా కాంగ్రెస్ నాయకులు పోలీసు స్టేషన్లో లో పిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ కెమెరాల్లో ఉన్నవారిని పోలీసు స్టేషన్ కు పిలిపించి, విచారించగా కట్ట మహేష్ ఉద్దేశ పూర్వకంగా చింపమని చెప్పాడని వాళ్ళు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే కట్ట మహేష్
పోలీసు స్టేషన్ కు రావడం, వచ్చిరాగానే అక్కడ ఉన్న దాదాపు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తూ, నానా బూతులు తిడుతూ వెళ్ళిపోయాడు.వెళుతూ వెళుతూ, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కట్ట మహేష్ ఇంటి వద్దకు రండి అనడంతో కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళారు.
ఇంటి దగ్గరికి వెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులను బూతులు తిడుతూ ఇంటిలోపలి వెళ్ళాడని, అక్కడ ఉన్నటువంటి ఇనుప రాడ్డుతో తన ఇంటి అద్దాలు తానే ధ్వంసం చేసుకొని రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులను బద్నాం చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమాచారం తెలుసుకొని పోలీస్ వారికి సమాచారం అందించి మహేష్ ఇంటివద్ద ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మాట్లాడుదాం అనుకోని వెళ్ళేసరికే మహేష్ గొడవ చేస్తున్నాడని తెలిపారు.
మేము చేసే సీసీ రోడ్డు పనులకు,కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకం బీజేపీ దే అని తప్పుడు ప్రచారాలు చేస్తూ సీసీ రోడ్లు వేసిన ప్రాంతంలో లో ఫోటోలు దిగి ఇది బీజేపీ రోడ్డే అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నాయకులు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని..ప్రజాహితం కొరకు మన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవోదయ విశ్వవిద్యాలయం నెరేళ్ల గ్రామం కు తీసుకువస్తే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కు తీసుకెళ్లినప్పుడు ఇట్టి బీజేపీ జగిత్యాల నాయకులు ఎందుకు అడ్డుకోలేదు మీకు చిత్త శుద్ధి ఉంటే మండల,జిల్లా బీజేపీ నాయకులు నవోదయ విశ్వవిద్యాలయం ను ధర్మపురి తీసుకువచ్చి సంస్కరవంతమైన రాజకీయం చేయగలరు.
కార్యక్రమంలో గొల్లపల్లి మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్,వైస్ చైర్మన్ పూరపటి రాజి రెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మాజీ తాజాఎంపీటీసీలు ,సర్పంచులు,వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.దీనిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసినట్లు లేదు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
