విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల, మే 12(ప్రజా మంటలు )
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని తొలి జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం చేయాలనీ కోరుతూ బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీ ఎస్ లత ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ శాతావాహన యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు, యాజమాన్యం తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. కళాశాల కు సంబంధించిన 6వ సెమిస్టరు పరీక్షల నిర్వహణపై తీవ్ర గందరగోళం ఏర్పడిందన్నారు. ఈ నెల 14 నుంచి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం, నేటికీ హల్ టికెట్ లు రాక ఇబ్బందులు ఎదుర్కోవడం తో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నరన్నారు. యూనివర్సిటి వైస్ ఛాన్స్ లర్ మొండి ప్రవర్తన కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుందన్నారు. ఇలాంటి వైఖరి సరికాదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోయి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో వైస్ ఛాన్స్ లర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం సైతం మొండి వైఖరి విధానం కాకుండా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం కు పెండింగ్ బిల్లులు చెల్లించడం తో పాటు, విద్యార్థుల పరీక్ష ల నిర్వహణపై పునః పరిశీలన చెయ్యాలని కోరారు. ప్రభుత్వం, యూనివార్సిటీ అధికారులు తమ పంతం నెగ్గించుకునేందుకు యాజమాన్యం లను బెదిరించడం, విద్యార్హులని ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదన్నారు.
యాజమాన్యం, విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉండి, ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధంగా ఉంటామని వసంత స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల స్పందించిన జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ తో ఫోన్ లో మాట్లాడగ, ప్రభుత్వం నిర్ణయం అని దీనికి యూనివర్సిటీ తరుపున చేసేది ఏమి లేదని పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలనీ వసంత విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ zptc సభ్యులు మహేష్ అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్ రాయకల్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్ కో ఆర్డినేటర్ శ్రీధర్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావు చింత గంగాధర్ రిజ్వాన్ హరీష్ ప్రణయ్ ప్రతాప్ భగవాన్ సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
