యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్
సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు):
NIPPON ఎక్స్ ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సిఎస్ఆర్) కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్ ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో యముడు,చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టు లేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు మద్యం తాగి వాహనాలు నడపకూడదని, దీనివలన వాహనాలు నడిపే వారితో పాటు ఎదుటివారికి ప్రాణహాని ఉంటుందని వారు హెచ్చరించారు. అతి వేగం పనికిరాదన్నారు. గమ్యస్థానానికి బయలుదేరే ముందు కొద్ది నిమిషాల ముందుగా బయలుదేరితే సురక్షితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా రోడ్డుపై వచ్చిన వారి వాహనాలను ఆపి, యముడి వేషధారి వారికి ట్రాఫిక్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి వెంకటేశ్వర్లు,సిఐ లు రామచందర్, బోస్ కిరణ్, ఎస్ఐ భూమేశ్వర్,NIPPON కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ సుధీర్ నాయర్, కలీం అలీ,అనిల్, ప్రియాంక సుధాకర్ 30 మంది సిబ్బంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్
