అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు
మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. వర్ష కొండ గ్రామంలోని పంట పొలాల్లో కరెంట్ పోలులు పడిపోవడంతో వర్ష కొండ గ్రామానికి కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఎర్ధండి గ్రామంలోని వడ్డెర కాలనీలో గుడిసెల్లో బతికే 9 మంది కుటుంబాల నిత్యవసర వస్తువులతో సహా మొత్తం కొట్టుకుపోయాయి.వాళ్లు ఎక్కడ ఉండాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బియ్యం,బట్టలు,తదితర నిత్యవసర వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోవడంతో వాళ్లు ఏమీ తోచని నిస్సహాయస్థితిలో ఉన్నారు. వారిపై దృష్టిసారించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని 30 ఏళ్లుగా ఊరికి దూరంగా చెట్లు నడుమ గుడిసెల్లో బ్రతుకుతున్న వీళ్లకు పక్కాఇళ్లను మంజూరుచేసి వారికి న్యాయంచేయాలని బాధాతప్త హృదయాలతో గ్రామస్తులుతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
