ఈనెల 27 28 తేదీలలో ఉత్తర తెలంగాణ వ్యవసాయ పరిశోధన సలహా సంఘ సమావేశం

On

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349483/9348422113)

జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు)

వ్యవసాయి పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశము ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయపరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈనెల ' 27, 28 తేదీలలో నిర్వహించనున్నట్లు సహా పరిశోధన సంచాలకులు జి. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వాణి ప్రకటనతో తెలిపారు.

ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నా సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలోని జిల్లా వ్యవసాయ అదికారులు, ఉద్యాన వన శాఖ, మరియు అనుబంద శాఖల అధికారులు పాల్గోంటారని వివరించారు. ఈసమా వేశములో దాదాపు 200 మంది రైతులు కూడా పాల్గోనడం జరుగుతుంది.

ఈ సమావేశము లో పరిశోధన సంచాలకులు డా॥ పి. రఘురామిరెడ్డి, విస్తరణ సంచాలకులు డా|| సుధా రాణి పాల్గోని వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని నివారించే దిశగా పరిశోధనలు చేపట్టే విధంగా దిన నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా గత సంవత్సరం జరిగిన పరిశోధనల ఫలితాలను రైతులకు ప్రజెంటేషన్ రూపంలో అంద జేయడం జరుగుతుందని తెలిపారు.

Tags