6గురు బిఅరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి-అర్థరాత్రి చేరికలు

On
6గురు బిఅరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి-అర్థరాత్రి చేరికలు

6గురు బిఅరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి-అర్థరాత్రి చేరికలు

వలసల వరదలో ఒక్కొక్కరు బియర్స్ ను విడడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. కేసీఆర్ ఎన్ని మీటింగ్ లు పెట్టిన అధికారం కోరుకొనే వారు గట్టు దాటుతున్నారు.

ఆ పార్టీకి చెందిన ఆరుగుర ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేశారు. గురువారం అర్థరాత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చేరివపోవడంతో ఆపార్టీ మరింత ఇరకాటంలో పడింది.

తెలంగాణలో చరిత్ర రిపీట్ అవుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. గత పదేళ్లులో చాలా మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీల్లో ఇమడ లేక కారు ఎక్కిన సంగతి ఇంకా గుర్తుండే ఉంటుంది. 

నిన్నటి వరకు కేసీఅర్ తొ ఉన్న ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, భాను ప్రసాద్, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, పార్టీ మారిన వారిలో ఉన్నారు.

అర్థరాత్రి డిల్లి నుండి వచ్చిన ముఖ్యమంత్రిని, అతని ఇంట్లో కలిసి కాంగ్రెస్ లో చేరారు వీళ్లంతా ఒంటిగoట సమయంలో హైదరాబాద్లో సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేసీఆర్ కు టాటా చెప్పేసి కాంగ్రెస్ కు జై కొట్టారు.

Tags