బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..
తాము బీసీలకు వ్యతిరేకం కాదు..
రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి
సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం
సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని రాష్ర్ట రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ అద్యక్షులు అప్పమ్మ గారి రాంరెడ్డి అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బీసీ కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.
దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.ఈ సమావేశంలో రాష్ర్ట రెడ్డి జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
