ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) :
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర కార్యవర్గ సమావేశం సీతాఫలమండి ఆర్.ఎం.కె. బ్యాంక్వెట్ హాల్‌లో జిల్లా ఇన్‌చార్జి ఇంజం వెంకటస్వామి మాదిగ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద దాడి దళితుల హృదయాలను గాయపరిచింది. ఆయన దళితుడిగా ఉన్నందునే కొంతమంది దళిత వ్యతిరేకులు ఈ దాడికి పాల్పడ్డారు. గవాయి స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఉన్నా ఈ దాడి జరిగి ఉండేది కాదు. ఇది కేవలం వ్యక్తిపై కాదు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై, దళితుల ఆత్మగౌరవంపై దాడి అని మండిపడ్డారు.అటువంటి దళిత వ్యతిరేక శక్తుల కుట్రలకు ప్రతిస్పందనగా, ఈ నెల 22న ఛలో హైదరాబాద్ – దళితుల ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీ విజయవంతం చేయడానికి తెలంగాణ నలుమూలల నుండి దళితులు, పీడితులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో డా. గోవింద్ నరేష్ మాదిగ, ఇంజం వెంకటస్వామి మాదిగ, డా. సోమశేఖర్ మాదిగ, టి.వి. నరసింహారావు మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, ఇటుక శ్రీకిషన్ మాదిగ, రఘల ఉపేంద్ మాదిగ, సందె కార్తిక్ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, జలపాల మహేష్ మాదిగ, కొండ్రుపల్లి శివ మాదిగ, మునిరాతి రామకృష్ణ మాదిగ, కండె రాము మాదిగ, వనము నర్సింగ్ రావు మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
