స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు
జగిత్యాల అక్టోబర్ 6 (ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం స్థాయి స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం జగిత్యాల పట్టణంలోని శుభమస్తు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తన బలాన్ని నిరూపించి ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగరవేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలను వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత గ్రామాల అభివృద్ధి కేంద్రంలో సాధ్యమవుతుంది.
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి అన్నగారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత గ్రామాల అభివృద్ధి కేంద్రం నిధులతోనే సాధ్యమవుతుంది ఆ నిధుల విలువను ప్రజలకు తెలియజేయండి అనే పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది గ్రామీణ ప్రజలకు అందిస్తున్న పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు,
వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి జిల్లా పరిషత్ చైర్మన్ ల వరకు బిజెపి ఆధిపత్యం సాధించాలి, కార్యకర్తలే పార్టీకి బలం అని వారి శ్రమతోనే విజయం సాధ్యమని తెలిపారు, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో బూత్ వారీగా కార్యకర్తలను సమన్వయం చేయండి స్థానిక నాయకులై ప్రజల విశ్వాసానికి ప్రతిగా కావాలి పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ విధానాలను ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని అన్నారు,
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ విఫలమై ప్రజలను మోసం చేసింది ఇక ప్రజలు మార్పు కోరుతున్నారు రాబోయేది బిజెపి ప్రభుత్వం కావాలని ప్రతి కార్యకర్త హృదయపూర్వకంగా నమ్ముతూ శ్రమించాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, వడ్డేపల్లి శ్రీనివాస్, కిషన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, జిల్లా కార్యదర్శిలు పాత రమేష్,సాంబరి కళావతి, జిల్లా కోశాధికారి దశరధ రెడ్డి మరియు పట్టణ, మండల అధ్యక్షులు మరియు జిల్లా పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
