గాంధీ ఏఆర్‌టీ సెంటర్ సేవలు బేష్
360 డిగ్రీ రివ్యూ చేసిన న్యూఢిల్లీ నాకో ఉన్నతాధికారులు
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీఆస్పత్రిలోని యాంటిరిట్రోవల్ థెరఫీ (ఏఆర్‌టీ) సెంటర్ అందిస్తున్న సేవలు బాగున్నాయని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) ఉన్నతాధికారులు అభినందించారు. నాకో డిప్యూటీ డైరక్టర్ జనరల్ డాక్టర్ తంజిమ్‌డికిడ్, న్యూఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ రాజీవ్ తివారీల నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం గాంధీ ఆసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌ను సందర్శించారు.
ఏఆర్‌టీ సెంటర్‌లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, టెస్టింగ్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, సీఓఈ, ఐసీటీసీ, ఓఎస్‌టీ, డీఎస్‌ఆర్‌సీ, ఎస్‌టీడీ క్లినిక్, పీపీటీసీ తదితర అంశాలపై 360 డిగ్రీల రివ్యూ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌ఐవీ సంబంధిత వ్యాధులు, తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు, గాంధీ ఏఆర్‌టీ సెంటర్‌లో అందిస్తున్న వైద్యసేవలను గాంధీఅధికారులు వారికి వివరించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎన్.వాణి, సీఓఈ డిప్యూటీ ప్రొగ్రామ్ డైరక్టర్ డాక్టర్ దీపక్, గాంధీ జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సునీల్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక అవిశెట్టి తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గాంధీ ఏఆర్‌టీ సెంటర్‌లో నిరుపేద రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీసేక్స్) ప్రతినిధులు సరస్వతి, సంజీవ్, శ్రీకాంత్, ఆర్‌ఎంఓ–1 శేషాద్రి, జనరల్ మేనేజర్ సంతోష్ వెంకటరమణ, అసిస్టెంట్ జనరల్ మెనేజర్ శివరామ్‌రెడ్డి, దిశ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
