చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై ఆధునిక చికిత్సా విధానాలపై సెమినార్
రాష్టంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 700 మంది ఈఎన్టీ వైద్యుల హాజరు
గాంధీ లో రెండు రోజుల మహాసభ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ లో ఈఎన్‌టి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈఎన్‌టి వైద్యుల మహాసభ (AOI TG CON–2025) ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి వి నందకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులపై ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్ర చికిత్సలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శస్త్ర చికిత్సలు నిర్వహించే పద్ధతులపై ఈ తరం వైద్యులకు ఇలాంటి సదస్సులు ఎంత ఉపయోగపడతాయని ఆయన అన్నారు. తాము కూడా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాజా టెక్నాలజీ ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
సీనియర్ల అనుభవాలు సలహాలు సూచనలు జూనియర్ డాక్టర్లకు ఎంత అవసరమని, చక్కటి సదస్సు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి, తెలంగాణ ఈ ఎన్ టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శోభన్ బాబు, ఎలెక్టెడ్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేష్, కార్యదర్శి డాక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ తోపాటు దేశవ్యాప్తంగా పేరుపొందిన 700 మంది ఈఎన్‌టి వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారు. రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి డా. జె.బి.ఎస్. రాథోడ్ మాట్లాడుతూ, “AOI TG CON–2025 మహాసభ ద్వారా యువ వైద్యులకు కొత్త జ్ఞానం, శిక్షణ లభిస్తుందని, సీనియర్ నిపుణుల అనుభవాలను పంచుకోవడం ద్వారా వైద్య రంగానికి, యువ వైద్యులకు మరింత మేలు కలుగుతుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
