ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత
-
మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)
ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట సుమారు 250 మంది ఆర్యవైశ్య ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కాల్వ సుజాత ముందుగా వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి, సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ కు రూ.25 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరముందన్నారు. సేవా భావంతో వాసవి ట్రస్ట్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు. మునుముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో వాసవి ట్రస్ట్ వ్యవస్థాపకుడు పబ్బ శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, మాజీ అధ్యక్షుడు కొత్త సురేశ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు కమటాల శ్రీనివాస్, మెట్పల్లి, జగిత్యాల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు రాంబాబు, వూటూరి నవీన్, పల్లెర్ల రాజు, నూనె శ్రీనివాస్, దువ్వ రాజు, గుండ శ్రీకాంత్, కాసం రాజశేఖర్, కొత్త సునీల్, నూనె శ్రీనివాస్,గుండా కార్తిక్, చెట్ల పవన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దువ్వ లావణ్య రాజు, అవోపా జిల్లా అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్, వేములవాడ ఆర్యవైశ్య సత్రం చైర్మన్ బుస్స శ్రీనివాస్,, ఇతర ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
