రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు
రెండు నెలల్లో 54 రాళ్ళ దాడి కేసులు నమోదు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) :
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లు రువ్విన వారిపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వారిపై రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) కఠిన చర్యలు చేపట్టింది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం 54 రాళ్ల దాడి కేసులు నమోదయ్యాయి. వాటిలో 30 కేసులను ఛేదించి 33 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. అంతేకాకుండా, ట్రాక్‌లపై వస్తువులు ఉంచిన 8 కేసులు నమోదు కాగా, 6 కేసులను ఛేదించి 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులు ప్రస్తుతం సంబంధిత కోర్టులలో విచారణలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ రైల్వేలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, ఎవరు రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే చర్యలకు పాల్పడినా 139 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
ఇలాంటి చర్యలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారడంతో పాటు దేశ సంపదకు నష్టం కలిగిస్తాయని, పిల్లలకు కూడా ఈ ప్రమాదాల గురించి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
