దాడి ఘటనపై డిఎస్పీనీ కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పైన జరిగిన దాడి ఘటనపై జగిత్యాల జిల్లా డిఎస్పీని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ కలిసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని,దాడి వెనుక ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అరాచక పాలన నడుస్తోందన్నారు.
ఈ సంఘటన వెనుక ఉన్న నిందితులకు ఇదివరకే నేరచరిత్ర ఉందని,వీరిని ఓ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపాడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి వివరించారు.ఈ సంఘటనపై డిఎస్పీ మాట్లాడుతూ నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని నిందితులు పరారీలో ఉన్నారని,వారిని ట్రేస్ చేసి పట్టుకుంటామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి తెలిపారు.
ఈ సంఘటనపై బాధితుడి భార్య మాట్లాడుతూ దాడికి యత్నించిన వారితో ప్రాణహానీ ఉందని డిఎస్పీ తో వాపోయింది.అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్యకర్తని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గొస్కుల జలెంధర్, మాజీ వైసిపి ఆవుల సత్యం, పిఎసిఎస్ చైర్మన్ వెంకట మాధవ రావు, మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్, బలభక్తుల కనుకుంట్ల లింగారెడ్డి, కిషన్ , సామల వీరస్వామి,మారం శేఖర్, చెవుల మద్ది సంతోష్, కలకోట సత్యం, యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
