సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

On
సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

కొత్తగూడెం సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):

తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి   కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజి రెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు  ధర్నా నిర్వహించారు. 

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ  నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల  రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదవత్ శాంత, వనమా రాఘవ పాల్గొన్నారు. IMG-20250902-WA0009

సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు వెల్లడించడంతోపాటు 35% వాటా ప్రకటించి మరియు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అసాధారణ జాప్యం చేస్తున్నది. 

పెరిగిన రాజకీయ జోక్యం - కొప్పుల ఈశ్వర్ 

సింగరేణి సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, కార్మికుల రక్షణ, సంస్థ ఆస్తులను కాపాడుతూ కొత్త బొగ్గు గనులను తీసుకురావడానికి కృషి చేయవలసిన బాధ్యతలను విస్మరించింది. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద సింగరేణి అధికారులు పడిగాపులు కాస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య. ఇప్పటికైనా సంస్థ భవిష్యత్తును, కార్మికుల మనోభావాలను గమనించి నడుచుకోవాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు.. 

కార్మికుల హక్కులను కాపాడటం, సాధించడంలో గుర్తింపు సంఘం ఏఐటియూసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఘోరంగా విఫలమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి. 

డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని టీబీజీకేఎస్ డిమాండ్ 

1)వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలి
2)కార్మికులకు ఆదాయపుపన్ను ను రద్దు చేయాలి, అలవెన్స్ లపై ఆదాయపన్ను ను యాజమాన్యమే చెల్లించాలి 
3)అనారోగ్య సమస్య లతో మెడికల్ బోర్డ్ కి వెళ్లే కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలి. 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలి.

4)వేలం పాట తో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గుగనులు కేటాయించాలి.
5)సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయల బకాయిలను కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

6)మెడికల్,ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి 
7)35 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్ కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే
ఉద్యోగాలు ఇవ్వాలి.
8) మారుపేర్లతో పనిచేస్తూ అన్ ఫిట్ అయినా కార్మికుల పిల్లలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి.
9)జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన  50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డు కు పిలిచి వారందరిని అన్ ఫిట్(ఇన్వాలిడేషన్)చేయాలి 
10)కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ ని రద్దు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలి.

ఈ సమస్యల మీద డైరెక్టర్ పా గౌతమ్ పొట్రూ ఐఏఎస్ గారికి మెమోరాండం  ఇవ్వడం జరిగింది 

 ఈ ధర్నా కార్యక్రమంలో  సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సెంట్రల్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ సెక్రటరీలు, బ్రాంచి కమిటీ సభ్యులు, ఫిట్ సెక్రటరీలు, హిట్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు డిఎల్ఆర్ కార్మికులు  పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు హైదరాబాద్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు): గణేష్ నిమజ్జనలో పాల్గొనడానికి వస్తారనుకొన్న, అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈనెల 9వ తేదీన జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిజీగా ఉండడం వల్ల, పోటీలో ఉన్న ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి NDA మద్దతుదారుల ఓట్లకు గండి కొడతామోనని...
Read More...
National  International   Current Affairs  

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,? న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు  బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా...
Read More...
Local News 

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   గురువారం గణేష్...
Read More...
Local News 

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం   జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభమైన అష్టాదశ పురాణ ప్రవచనం సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పురాణంపై ప్రవచనాన్ని బుర్ర భాస్కర్ శర్మ కొనసాగిస్తున్నారు. ఆధ్యంతం ఎన్నో ఉపమానాలతో పురాణ ప్రవచనము కొనసాగుతుంది. పురాణ ప్రవచనాన్ని వినడానికి...
Read More...
Local News 

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో  ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో  25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ...
Read More...
National  Current Affairs   State News 

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు? కాంగ్రెస్ అగ్రకులాల,ఎస్సీల ఓట్ల లెక్కలలో చిక్కుకుంది సీట్ల పంపకం గురించి ఆర్జేడీ ఆందోళనలు పాట్నా సెప్టెంబర్ 04: మహాకూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి ముఖంగా చూపించడంలో కాంగ్రెస్ విముఖత చూపడానికి కారణం ఓటు లెక్కలు. కాంగ్రెస్ అగ్ర కులాలు, షెడ్యూల్డ్ కులాలను ఆకర్షించాలని చూస్తోంది. తేజస్వి పేరును ప్రకటించడం ద్వారా అగ్ర కులాలు,...
Read More...
National  International  

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించే దిశలో నేపాల్ ప్రభుత్వం  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: నేపాల్‌లో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, మరో 23 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నియమాలను పాటించలేదని పేర్కొంది; అసమ్మతిని నిశ్శబ్దం చేయడం మరియు ఆన్‌లైన్ ప్రసంగంపై నియంత్రణను కఠినతరం చేయడం ఈ చర్య యొక్క లక్ష్యం అని విమర్శకులు...
Read More...
Local News 

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   కిడ్నీ వ్యాధుల వల్ల కలిగే అనర్ధాలపై గాంధీ మెడికల్ కళాశాలలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గాంధీ వైద్య  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర జండా ఊపి ర్యాలీ ని  ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధుల పట్ల
Read More...
Local News 

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్... సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు): ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా నల్లగుట్ట ఓల్డ్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో గురువారం ఘనంగా  నిర్వహించారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. హెడ్మాస్టర్చిన్నాబత్తిని శౌరి మాట్లాడుతూ..సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన ఆచరణ, ఆలోచనలు ఉపాధ్యాయ వృత్తికి మార్గదర్శకం అన్నారు. ఉపాద్యాయులు  జాకీరా సుల్తానా, శైలజ,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు   సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు  రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో  సీ–ఏఆర్ఎమ్,...
Read More...
Local News 

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్, వ్యాసరచనా రైటింగ్ పోటీలలో భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ  ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో గాయత్రి డ్రాయింగ్‌లో మొదటి బహుమతి సాధించగా,శివం కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. మణితేజ్ గౌడ్ ఎస్సే రైటింగ్‌లో సెకండ్ ప్రైజ్
Read More...
Local News 

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ మద్యం, సిగరేట్లకు అలవాటై...బైక్ దొంతనాలు..    రూ.5లక్షల విలువ చేసే ఆరు బైకుల స్వాధీనం సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) : ప్రభుత్వ ఆసుపత్రులను టార్గెట్‌చేసుకుంటూ వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగ దంపతులను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.ఐదు లక్షల విలువ చేసే ఆరు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు....
Read More...