ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఆగస్టు 29:
భారీ వర్షాల కారణంగా, గోదావరి నది గణనీయంగా పెరిగింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనికి భారీగా చేరిన ఇన్ ఫ్లో గణనీయంగా పెరగగా, తదనుగుణంగా ఇన్ ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కొన సాగిస్తున్నారు. కడెం నుండి 700 అడుగుల గరిష్ఠ స్థాయికి గాను, బుధవారం రాత్రి 10.30 గంటలకు
696 అడుగుల ఎత్తుకు నీటిని స్థిరంగా ఉండేలా క్రమానుగతంగా 6గేట్లను ఎత్తడం ద్వారా గరిష్టంగా 42వేల క్యూసెక్కుల నీటిని ఉదయం నుండి వదిలారు. కడెం వరద నీటిని గోదావరి నది లోనికి వదలడంతో, సదరు నీరు ధర్మపురికి క్రమానుగతంగా చేరి, నీటి మట్టం అనుక్షణం పెరిగింది. ఉదయం నడి ఒడ్డున గల శ్రీ సంతోషి మాతా ఆలయం దాటి, రామాలయం సమీపానికి వరదలు చేరాయి.
అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి అదే క్రమంలో అధిక వరద నీటిని గోదావరి లోనికి వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరిన ఇన్ ఫ్లో బట్టి 1091 అడుగుల ఎత్తుకు గాను1089.20 అడుగుల ఎత్తును సరిచూసుకుని, రాత్రి 9.00కి 1లక్ష41వేల క్యూసెక్కుల నీటిని వదిలి క్రమేపీ 39 గేట్ల ద్వారా గరిష్టంగా 3,00,000 క్యూసెక్కుల నీటిని గోదావరి లోనికి వదిలారు. గురువారం ఉదయం వరకు సదరు నీరు ధర్మపురి క్షేత్రం ప్రాంతానికి చేరుకొనున్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ..... తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎప్పటి కప్పుడు నీటి ఉధృతి సమాచారాన్ని అందుకుంటూ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం ఉదయం
ధర్మపురిలోని మంగలి గడ్డ వద్దకు స్థానిక ఎమ్మెల్యే, సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని గోదావరిని పరిశీలించి తగు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అధికారులతో సమన్వయం కలిగి ఎప్పటి కప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మపురి తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ రాం నర్సింహా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ ఐ ఉదయ్ కుమార్, తమ సిబ్బందిని సమన్వయ పరిచే విధంగా ఉపక్రమించి, అనుక్షణం సమాచారాన్ని ప్రాజెక్టుల అధికారుల ద్వారా తెలుసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ, గోదావరి నది ఒడ్డున మకాం వేసి, దేవస్థానం పక్షాన మైకులలో ప్రకటింప చేస్తూ, తీరవాసులను అప్రమత్తం చేసే చర్యలు గైకొన్నారు. రెవెన్యూ అధికారులు గోదావరి తీరాన గల సంతోషి మాత ఆలయం లోనికి నీరు చేరగా, భక్తుల స్నానాలను నిలిపి వేసి, నది ప్రవాహం వద్దకు ఎవరినీ వెళ్లనీయ కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి వరకు ఎస్సారెస్పీ నుండి 2.50లక్షలు, కడెం నుండి 40వేలు నిరవధికంగా నీరు గోదావరి లోనికి వదలగా, ధర్మపురి వద్ద నిలకడగా ఉండగా, అధికారులు అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు తీసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
