హరిహరాలయంలో పాలెపు చంద్రశేఖర్ శర్మచే శమంత కోపాఖ్యానం
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో బుధవారం గణేష్ నవరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మచే శమంతకోపాఖ్యానం ప్రవచనం కొనసాగింది .
ఈ సందర్భంగా పార్వతీ తనయుని జీవిత విశేషాలను పుట్టుకను వివరించారు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసినట్లయితే నీలాప నిందలు పడతాయని అలాంటివారు శమంత కోపాఖ్యానం విని తరించాలని చంద్రశేఖర్ శర్మ అన్నారు ప్రతిఏటా బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో k నిర్వహించబడుతుందని విగ్నేశ్వరునికి ఇరవై ఒక్క మార్లు వేద బ్రాహ్మణోత్తములచే అభిషేకం నిర్వహించబడుతుందని తెలిపారు.
ప్రవచనం అనంతరం బ్రాహ్మణ సంఘ సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మచే స్వామివారి శేష వస్త్రమును ప్రసాదమును చంద్రశేఖర్ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చాకుంటా వేణు మాధవరావు బాధ్యులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, కొత్తపెళ్లి సత్యనారాయణ శర్మ ,శ్రీధర గణపతి శర్మ, రుద్రాంగి నరేందర్ శర్మ, రాఘవేందర్ శర్మ .తిగుళ్ల ఫణి రాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేసి ఆశీర్వచనం చేశారు. వైదిక క్రతువును పాలెపు వెంకటేశ్వర శర్మ నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
