వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి భూమి ఇవ్వండి
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు "విడిసి విజ్ఞప్తి"
తహసీల్దార్ కు విజ్ఞాపన పత్రం అందజేసిన విడిసి, రైతులు
బుగ్గారం ఆగస్టు 26 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం కోసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ భూమి కేటాయించి చట్టబద్ధంగా అప్పగించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్వర్యంలో రైతులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞాపన పత్రం పంపించడం జరిగిందని విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు.
మంగళ వారం స్థానిక తహసీల్దార్ కు కూడా రైతులతో కలిసి విడిసి ద్వారా విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ
బుగ్గారంలో సరైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు.
ఆరు గాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్మడానికి సరైన స్థలం లేక పోవడంతో ఎండలకు, వానలకు, వడగళ్ల వర్షాలకు, ధాన్యం ఆరబెట్టుటకు, తూకం వేసిన ధ్యానం బస్తాలను రవాణా చేయుటకు రైతులు ప్రతీ పంట కాలంలో తీరని కష్టాల పాలు - నష్టాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపాన గల ఊరగట్టు ప్రాంతంలో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ భూమిని రైతుల కోసం కేటాయించి విడిసి కి అప్పగించాలని కోరారు. ఈ పంట రాకముందే ప్రభుత్వ ఆర్థిక సాయంతో అట్టి భూమిని చదును చేపిస్తే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును ఈ ప్రాంత రైతులు చిరకాలం గుర్తుంచు కుంటారని ఆయన పేర్కొన్నారు. స్థానిక నాయకులు, ప్రముఖులు, గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కమిటీకి సహకరించి రైతుల కష్టాలు తీర్చడానికి దోహద పడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న, అధ్యక్షులు నక్క చంద్రమౌళి, సహాయ కార్యదర్శి కళ్లెం నగేష్, రైతులు మసర్తి రాజిరెడ్డి, మాదాసు చంద్రయ్య, పరుమాల చిలుకయ్య, పొలంపల్లి మల్లేశం, కేతి చిలుకయ్య, గట్టు ప్రవీణ్, ఏలేశ్వరం గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
