నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష
జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ తేది 25-02-2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు.
అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన RTC కండక్టర్ దుంపటి లక్ష్మీ రాజ్యం (56 సంవత్సరాలు, Swift Dzire B/No.TS 16ES 1403) తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి, పార్క్ చేసిన ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజుల సాయన్న తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై అశోక్ కేసు నమోదు చేయగా, మెట్‌పల్లి సీ.ఐ ఎల్. శ్రీను పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్ట్ ట్రయల్ సమయంలో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ ఎం. చక్రపాణి సాక్షులను ప్రవేశపెట్టగా, ఏపీపీ ప్రణయ్ గారు సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ఆధారాలను పరిశీలించిన అనంతరం, గౌరవ మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ నిందితుడికి పది నెలల జైలు శిక్ష విధించారు.
ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన సీఐ ఎల్. శ్రీను, ఎస్సై ఎం. అశోక్ కుమార్, కానిస్టేబుల్ ఎం. చక్రపాణిలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
