30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్
ప్రజలు 20 కి.మీ దూరంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి
ఆర్థికభారం, సమయనష్టం, ఇబ్బందులతో ప్రజలు ఆగ్రహం
భీమదేవరపల్లి, ఆగస్టు 28, ప్రజామంటలు:
మండలంలోని వంగర గ్రామంలో 30 పడకల ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉంది. ఈ ఆసుపత్రిలోని ఎక్స్ రే యంత్రం గత మూడు సంవత్సరాలుగా పనిచేయడం లేదు. ఫలితంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య సేవల కోసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. రోజువారీ కూలి పనులు చేసే రోగులకు ఇది మరింత భారంగా మారి, ఆర్థికపరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
*స్థానిక ప్రజల వేదన*
చిన్నపాటి ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే ఎక్స్ రే తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. కాని ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కో ఎక్స్ రే 500 -700 రూ.ల వరకు ఖర్చు అవుతోందని అన్నారు. అదనంగా ప్రయాణ ఖర్చులు తోడవడంతో పేద కుటుంబాలపై భారం పడుతోందని అంటున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమస్య పరిష్కరించమని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు కనిపించడంలేదు.
*అధికారుల స్పందన*
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అప్పయ్య మాట్లాడుతూ,
"వంగర ప్రైమరీ హెల్త్ సెంటర్ శిథిలావస్థలో ఉంది. ఈ కారణంగానే ఎక్స్ రే మిషన్ కూడా పనిచేయడం లేదు. కొత్త ఆసుపత్రి భవనాన్ని ఏర్పాటు చేసి, ఆధునిక ఎక్స్ రే యంత్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
