హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.
24 గంటల పాటు గాంధీలో నో వాటర్
నిలిచిపోయిన ఆపరేషన్లు..కంపుకొట్టిన వాష్ రూమ్స్
రోగులు, సహాయకులు,నర్సింగ్ సిబ్బంది నరకయాతన
సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) :
గాంధీఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషంట్ల వార్డులు, ఆపరేషన్ థియేటర్లకు మంచినీటి సరఫరా చేసే పంపింగ్ మోటార్లు మొరాయించడంతో దాదాపు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోయి రోగులు, వైద్యసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు విభాగాలకు చెందిన ఆపరేషన్ థియేటర్లలో శస్త్రచికిత్సలు వాయిదా పడగా, వైద్యసేవల్లో తీవ్ర జాప్యం నెలకొంది. గురువారం రాత్రి నీటి సరఫరా నిలిచిపోగా 24 గంటలు గడుస్తున్నా గాంధీ పాలనయంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని పలువురు వాపోయారు. వివరాలు... ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా జలమండలి నుంచి సరఫరా అయ్యే మంచినీరు ఆసుపత్రి ఆవరణలోని పంప్‌హౌస్‌సంపులో పడుతుంది.
అక్కడి నుంచి ఆరు పంపుసెట్ల ద్వారా ఆస్పత్రి ప్రధాన భవనం పైనగల ఓవర్‌హెడ్ ట్యాంకులకు అక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా ఆయా విభాగాలకు చేరుతుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో పంప్‌హౌస్‌లోని ఆరు మోటార్లు ఒకేసారి సమస్య తలెత్తడంలో నీటి సరఫరాలో ఇబ్బంది తలెత్తింది. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రధాన భవనం 8 అంతస్థుల్లోని వార్డులకు నీటి సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వైద్యసిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆయా విభాగాల్లోని ఆపరేషన్ థియేటర్లలో శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వైద్యసేవల్లో జాప్యం నెలకొంది. ఓ వైపు తెలంగాణలో భారీవర్షాలు కురుస్తుండగా, గాంధీఆస్పత్రిలో మాత్రం గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నామని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా వార్డుల్లోని బాత్‌రూమ్, వాష్‌రూమ్‌లు తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాటిని వినియోగించకుండా తాళం వేయడంతో ఎక్కడికి వెల్లాలో తెలియక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రూ.20 పెట్టి లీటరు వ్యాటర్ బ్యాటిల్ కొని దాహార్తి తీర్చుకున్నా, ఇతర అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియడంలేదని నిరుపేద రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గాంధీఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్థులో నర్సింగ్ స్కూలు కొనసాగుతోంది.నీటి సరఫరా నిలిచిపోవడంతో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. బాత్‌రూమ్, వాష్‌రూమ్ అవసరాలు తీర్చుకునేందుకు గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం వద్దగల పవర్‌బోర్ నుంచి మంచినీటిని బకెట్లలో నింపుకుని ఎనిమిదవ అంతస్థుకు తీసుకువెల్తున్నారు. గత రెండున్నర నెలల క్రితం కూడ పంపుహౌజ్ లో విద్యుత్ సమస్య తలెత్తడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పుడు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ కేబుల్ లైన్లను ఏర్పాటుచేశారు. కొద్దిరోజులకే తిరిగి పంపుసెట్టు మోరాయించడం ఆసుపత్రి నిర్వహణ దుస్టితి తెలుపుతోంది. కాగా 24 గంటల తర్వాత రెండు పంపుసెట్ల సాయంతో నీటి సరఫరా ను పునరుద్దరించినట్లు తెలిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
