తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాటం
మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 26 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని మంగళవారం వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల జలందర్, మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత తో నెలకొన్న యూరియా కొరత పట్ల పాలకులు దృష్టి పెట్టి రాష్ట్రంలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతుల తిరుగుబాటు తప్పదని ,రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరు బాట పడుతుందని తెలియజేశారు.
గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో యూరియా కొరత లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం పడిదాపులు కాస్తున్నారని మాట్లాడారు, కెసిఆర్ రైతు పక్షపాతిగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల జలంధర్, మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్ ,తాజా మాజీ ప్రజా ప్రతినిధులు ,ఆవుల సత్యం, నక్క శంకరయ్య,నేరెళ్ల గంగారెడ్డి, అలిశెట్టి రవీందర్, కనుకుoట్ల,లింగారెడ్డి , బలభక్తుల కిషన్, నల్ల శ్యామ్, కొక్కుల భూమయ్య,చెవుల రవీందర్, అవారీ చందు,అశోక్ రావు, బోల్లం భోజనపు శ్రీనివాస్ ,కచ్చు కొమురయ్య ,సామల వీరస్వామి, రైతులు మహిళలు మండలపార్టీ నాయకులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
