భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల /ధర్మపురి ఆగస్ట్ 28 (ప్రజా మంటలు)
జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.జిల్లా కేంద్రంతో పాటు అనoతారం వద్ద గల వాగును, ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని, రాయపట్నం బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు.
భారీ వర్షాల వల్ల ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుండి నీటి ప్రవాహం కొనసాగుతున్న దృష్ట నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటుంది కావున నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నీటి ప్రవాహాని అంచనా వేయకుండా స్నానాలు చేయడానికి నది లోపలికి వెళ్లే ప్రయత్నం చేయవద్దన్నారు. వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు,కాలువలు,కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు.అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు
ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,ధర్మపురి సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
