సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 29 (ప్రజా మంటలు)
పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్ మండలం,జగిత్యాల పట్టణానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల 82 వేల 200 రూపాయల విలువగల చెక్కులను ,89 మందికి కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 89 లక్షల రూపాయల విలువగల చెక్కులను,జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 52 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల,43 మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 43 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో RDO మధుసూదన్, ఎమ్మెర్వో రామ్మోహన్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ జడ్పీటీసీ లు ఎల్లారెడ్డి,పెండెం రాములు,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,సీనియర్ నాయకులు కొలుగురి దామోదర్ రావు, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,సురేందర్ రావు, బాల ముకుందం,బాలే శంకర్,నక్కల రవీందర్ రెడ్డి,రౌతు గంగాధర్,గడ్డం నారాయణ రెడ్డి,తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,మాజీ కౌన్సిలర్ లు, పట్టణ నాయకులు,యూత్ నాయకులు,మహిళలు,
రెవెన్యూ అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్య వైద్యం ఉపాధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు 20 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ పూర్తయిందని త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మహిళల వృత్తి నైపుణ్యానికి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్ ట్రైనింగ్ సెంటర్ మంజూరైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐదు కోట్ల నిధులతో మహిళలకు ఇందిరా మహిళ శక్తి భవనం నిర్మాణం చేపట్టామన్నారు
ముఖ్యమంత్రితో కలిసి పనిచేసే అభివృద్ధి చేస్తానన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
