ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 26 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ సర్వ సభ్య సమావేశం మంగళ వారం గాంధీ ఫోరెన్సిక్ లెక్చర్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ ఆసుపత్రి లో వైద్యులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. నరహరి అధ్యక్షుడు , డాక్టర్ డా. లాలు ప్రసాద్ రాథోడ్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ ఎం.కె. రౌఫ్ ట్రెజరర్ లు మాట్లాడుతూ..డాక్టర్స్ కు సంబంధించిన ముఖ్యంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.TVVPలో ప్రధాన సమస్యలైన డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ సర్వీసెస్ గా మార్చడం, TVVPను గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుండి డైరెక్టరేట్‌గా (DSH) మార్చే ఫైల్, అలాగే ఆసుపత్రుల పునర్‌వ్యవస్థీకరణ ఫైల్ రెండూ ఎటువంటి ఆర్థిక భారమూ లేకపోయినా ఏడాది రోజులుగా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) నియామకాలు కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. DYCS, CSS ప్రమోషన్ల కొరకు ఆప్షన్స్ అడగడం శుభపరిణామమని తెలిపారు. అలాగే ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సింది అన్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుండి Programme Officers (DCHS) ప్రమోషన్లు జరగలేదని అన్నారు. Directorate of Health (DH)లో సమస్యలైన G.O. 142 సవరణ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని తెలిపారు.
DH డెంటల్ వైద్యులకు పదోన్నతి మార్గం లేకుండా పదవీవిరమణ జరుగుతోందని ఇది తక్షణమే పరిష్కరించాలని కోరారు. బోధనేతర వైద్యులకు కనీసం Career Advancement Scheme (CAS) రూపంలో టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆరోగ్య శాఖ తనే ఆధారంగా ఉన్న వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్స్ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గాంధీ ఆసుపత్రి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ అబ్బయ్య లు మాట్లాడుతూ.. గాంధీ లో వైద్యుల సేవలు గుర్తించాలని కోరారు. రాష్ట్రం లో అతి పెద్ద ఆసుపత్రి గా చరిత్ర ఉన్న గాంధీ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ రవి, డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ కళ్యాణ్, సీనియర్ వైద్యులు సుబోధ్ , డాక్టర్ నాగార్జున, ఉస్మానియా యూనిట్ అధ్యక్షులు డాక్టర్ వినోద్, గాంధీ కార్యవర్గ బృందం డాక్టర్ రాజేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ రమేశ్, డాక్టర్ వెంకట మణి , డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దీనదయాళ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వినోద్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, సుధార్ సింగ్, డాక్టర్ రజని, మీనాక్షి, నజీం, బ్రహ్మేశ్వర్, యోగేందర్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
