లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


జగిత్యాల/ ధర్మపురి/ రాయికల్ జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు)

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి..
ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి..
ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు వేగంగా చేపట్టాలి..
ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందనీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం ధర్మపురి గోదావరి నది, ధర్మపురి మండలం నేరెళ్లలో లో జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి రాయికల్ మండలం రామోజీపేట బ్రిడ్జి ఇటిక్యాలలో లో లెవెల్ బ్రిడ్జి ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్గా ఉంచాలని అధికారులకు సూచించారు. ముందు జాగ్రత్తగా చెప్పడాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి నుండి 39 గేట్లు నుండి.నీటిని గోదావరి నదిలోకి వదిలారనీ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు నుండి 6 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదిలారనీ, గోదావరి నది భారీగా నీటి ప్రవాహం వస్తున్నందున  గోదావరి నది తీర ప్రాంతాలలో లోతట్టు  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

ఎగువ ప్రాంతాల్లో  గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్ ఆర్ ఎస్ పి. మరియు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున గోదావరిలో భారీగా వరద వస్తున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో తో కలిసి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు.. గత 15 రోజులుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  వరద పై రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష  నిర్వహించారని పేర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించడం జరిగిందని,ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు,పోలీసులు అందుబాటులో ఉంటారని, అధికారులకు కూడా తీర ప్రాంత ప్రజలు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

ప్రజలంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా అధికారులను తమను సంప్రదించవచ్చని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవో తహసీల్దారులు, పోలీస్ సిబ్బంది సిఐఎస్ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం   జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్  బి నారాయణ తెలిపారు మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము...
Read More...
National  International  

సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం

సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు): లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం...
Read More...
State News 

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు...
Read More...
Local News 

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం    జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని  కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Read More...
Local News 

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి  తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి   తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు   జగిత్యాల, మార్చి 12:అసంబధ్ధమైన, ఆశాస్త్రియమైన తెలంగాణ విద్యా కమిషన్ సిపారసులను విరామించుకోవాలని జగిత్యాల జిల్లా తపస్ అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు.    తపస్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై గీత గ్రంధాలయం కేంద్రంగా గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...
Read More...
Local News 

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్    జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల...
Read More...
Local News 

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా  వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ ఈ...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్  స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని  శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ...
Read More...
Local News 

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు): సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన...
Read More...
State News 

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే...
Read More...